తీవ్ర ఎండల బారిన పడి వృద్ధుడి మృతి

తీవ్ర ఎండల బారిన పడి వృద్ధుడి మృతి
మోత్కూర్, మే 23 (ఆంధ్రప్రభ): యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం పొడిచేడు గ్రామానికి చెందిన వరికుప్పల శంకరయ్య (65) వడదెబ్బతో మృతి చెందినట్లు బీజేపీ మోత్కూర్ మండల మాజీ అధ్యక్షుడు దీటి సందీప్ తెలిపారు.
గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న తీవ్రమైన ఎండలను తట్టుకోలేక శంకరయ్య అస్వస్థతకు గురయ్యారని, శనివారం ఆయన మరణించినట్లు వెల్లడించారు.
మృతుడికి భార్య మృతిచెందగా, కుమారుడు రమేష్ ఉన్నారు. శంకరయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుని తగిన సాయం అందించాలని దీటి సందీప్ కోరారు.
