ఈరోజు వడోదర వేదికగా జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయం సాధించింది. ముంబై ఇండియన్స్‌తో తలపడిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన మాజీ ఛాంపియన్, ముంబై ఇండియన్స్ మహిళల జట్టు… 164 పరుగులకు ఆలౌటైంది. డిల్లీ బౌలర్లలో అన్నాబెల్ సదర్లాండ్ (ఆస్ట్రేలియా ప్లేయర్) మూడు వికెట్లు దక్కించుకుంది. శిఖా పాండే (టీమిండియా) రెండు వికెట్లు తీసింది. ఆలిస్ క్యాప్సే (ఇంగ్లండ్), మిన్ను మణి (టీమిండియా)తలో వికెట్ దక్కించుకున్నారు
అనంతరం ఢిల్లీ జట్టు 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. కెప్టెన్ మెగ్ లానింగ్ – ఆస్ట్రేలియా ప్లేయర్ (15), షఫాలీ వర్మ (43), నికి ప్రసాద్ (35), సారా బ్రైస్ – స్కాట్లాండ్ ప్లేయర్ (21) రాణించారు. దీంతో డిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టు రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
కాగా, డబ్ల్యూపీఎల్ లీగ్ మ్యాచ్ ల్లో భాగంగా రేపటి మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ మహిళలు, యూపీ వారియర్స్ మహిళా జట్లు తలపడనున్నాయి.