Telangana | ప్రజలకు ఆర్టీసీ లైఫ్ లైన్

Telangana | ప్రజలకు ఆర్టీసీ లైఫ్ లైన్
- ఆర్టీసీ సంస్థ మనందరి సంస్థ
- రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
- రేగొండలో రూ .3.75కోట్లతో బస్టాండ్ పనులకు శంకుస్థాపన
Telangana | భూపాలపల్లి / రేగొండ, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ లైఫ్ లైన్ గా మారిందని నిత్యం 65 లక్షల మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చుతుందని, ఆర్టీసీ సంస్థ ప్రజలందరిదని రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ రోజు ప్రజల సౌకర్యార్థం జయశంకర్ జిల్లా రేగొండ మండలంలో రూ.3 కోట్ల 75 లక్షలతో నూతన బస్టాండ్ నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్, ఆర్టీసీ ఈడి సులేమాన్‌లతో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా 97 డిపోలు ఉంటే 341 బస్ స్టేషన్లలో పదివేల బస్సులు, దాదాపు 40 వేల మంది ఉద్యోగులుగా పనిచేస్తున్నారని తెలిపారు. ఆర్టీసీ ద్వారా రోజుకు 65 లక్షల మంది ప్రజలను చేరవేస్తూ 35 లక్షల కిలోమీటర్లు బస్సులు ఆర్టీసీ నడిపిస్తుందన్నారు.
దేశవ్యాప్తంగా రైల్వే లైఫ్ లైన్ లో ఎలా ఉందో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల పేద ప్రజలతో సహా అందరు కూడా ఒక లైఫ్ లైన్ గా ఆర్టిసి నడుస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం ప్రకారంగా ఆర్టీసీ బస్సు ప్రతి గ్రామానికి చేరాల్సిందే.. ప్రజలు దాన్ని గౌరవించి ఆర్టీసీ బస్సు ఎక్కితే సురక్షితంగా చేరుకుంటారన్నారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు.
అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో అమలు చేసి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామన్నారు. నియోజక వర్గానికి 3500 ఇండ్లు, 200యూనిట్లు ఉచిత విద్యుత్, అర్హులైన వారికి రేషన్ కార్డులు సన్న బియ్యం అందజేస్తున్నామన్నారు.
ప్రజలందరికీ సౌకర్యంగా ఉండే విధంగా ఇంజనీరింగ్ ప్లాన్ చేసుకొని, గ్రామపంచాయతీ పర్మిషన్ తో రేగొండ బస్టాండ్ సుందరంగా నిర్మించాలన్నారు. అదేవిధంగా మేడారం వెళ్లే వారికి రేగొండ సెంట్రల్ పాయింట్ కావడంతో వాహనాలు నిలిపేందుకు విడిది కోసం ఈ ప్రాంతంలో గ్రౌండ్ ఏర్పాటు చేయాలని స్థానిక అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్ఎం విజయ భాస్కర్, డిప్యూటీ ఆర్ ఎం భాను కిరణ్, డిప్యూటీ ఆర్ ఎం ఓ మహేష్, ఈఈ సింగ్, భూపాలపల్లి ఆర్టీసీ డిఎం ఇందు, ఎమ్మర్వో. శ్వేతరావు, ఎంపీడీవోలు. వెంకటేశ్వరరావు, రాంప్రసాద్, గ్రామ సర్పంచ్. వారణాసి మౌనిక, జిల్లా నాయకులు గుటోజు కిష్టయ్య, నాయినేని సంపత్ రావు, మోడెమ్ ఉమేష్ గౌడ్, ఎర్రబెల్లి రవీందర్ రావు, సూరం వీరేందర్, నాయకులు ఇప్పకాయల నర్సయ్య, మేకల భిక్షపతి, చిగురుమామిడి కుమారస్వామి, పున్నం రవి, కాశెట్టి రాజయ్య, కేసిరెడ్డి ప్రతాప్ రెడ్డి, ముడుతనపల్లి శంకర్, నడిపెల్లి వెంకట్రావు, మైస భిక్షపతి, నాండ్రే రవీందర్, నంసాని రాంబాబు, క్యాతం సదయ్య, పత్తి తిరుపతి, బోయిని కుమారస్వామి, సబ్బిది సురేందర్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, బండారి దేవేందర్, జున్ను సురేష్, గండి తిరుపతి, నాగపూరి శ్రీధర్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
