ఘనంగా రంజాన్ పర్వదినం వేడుకలు..

ఘనంగా రంజాన్ పర్వదినం వేడుకలు..
- ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు
- ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు
- మున్సిపల్ చైర్ పర్సన్ పావని రమేష్ గౌడ్
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ తో పాటు మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న ముస్లిం సోదర, సోదరీమణులు నెల రోజుల పాటు కటినమైన ఉపవాస దీక్షను నిర్వహించి శనివారం పవిత్ర రంజాన్ పర్వదినం వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. స్థానిక ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు చౌటుప్పల్ మున్సిపల్ చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, మార్కెట్ చైర్మన్ వెంకటయ్య తదితర ప్రజాప్రతినిధులు పవిత్ర రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కాగా..
ముస్లిం సోదరులు చిన్న పెద్ద తేడా లేకుండా నీట్ గాలలో పవిత్ర రంజాన్ ప్రార్థనలు నిర్వహించి ఒకరికొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోషిక వినయ్ కుమార్, మున్సిపల్ కౌన్సిలర్లు మహమ్మద్ హన్ను, బద్రి గాలయ్య, కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి, పిల్లలమర్రి మధుసూదన్, దేప రమ్య రాజు, ఊడుగు జ్యోతి రమేష్ గౌడ్, మాజీ కౌన్సిలర్ బాబా షరీఫ్, షాదీ ఖానా చైర్మన్ కరీం, మాజీ చైర్మన్ లు ఖలీల్, ఎజాజ్ పాష, ఇంతియాజ్ పాషా తదితరులు పాల్గొన్నారు.
