Women’s T20 World Cup 2026 | హర్మన్‌సేనకు మెన్స్ టీమ్ శుభాకాంక్షలు

Women’s T20 World Cup 2026 | హర్మన్‌సేనకు మెన్స్ టీమ్ శుభాకాంక్షలు

Women’s T20 World Cup 2026 | మహిళల టీ20 ప్రపంచకప్‌కు ముందు ప్రత్యేక వీడియో విడుదల చేసిన బీసీసీఐ
విజేత‌గా నిల‌వాల‌ని ఆకాంక్షించిన రోహిత్ శర్మ, గిల్, గంభీర్

Women’s T20 World Cup 2026 |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026లో భారత జట్టు తన తొలి మ్యాచ్‌కు సిద్ధమవుతున్న వేళ, పురుషుల జట్టు సభ్యులు మహిళల క్రికెట్ జట్టుకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రత్యేక వీడియోను విడుదల చేసింది.

వీడియోలో మాజీ భారత కెప్టెన్ రోహిత్ శర్మ, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ తదితరులు మహిళల జట్టుకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ, భారత మహిళల జట్టు గత కొన్ని సంవత్సరాలుగా అద్భుత ప్రదర్శన చేస్తోందని ప్రశంసించారు. ఈసారి ప్రపంచకప్‌ను సొంతం చేసుకుని దేశానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు.

శుభ్‌మన్ గిల్, గౌతమ్ గంభీర్ సహా ఇతర ఆటగాళ్లు కూడా హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని జట్టుకు మద్దతు ప్రకటిస్తూ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన చేయాలని కోరుకున్నారు. మహిళల జట్టుపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో, మెన్స్ టీమ్ సభ్యుల నుంచి వచ్చిన ఈ ప్రోత్సాహక సందేశాలు ఆటగాళ్లలో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి.