వీధి కుక్కల వీరంగం..

వీధి కుక్కల వీరంగం..

  • తీవ్రంగా గాయపడిన మహిళ..
  • రోజు రోజుకి పెరిగిపోతున్న క్షతగాత్రులు…

బూర్గంపాడు, ఆంధ్రప్రభ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల వ్యాప్తంగా వీధి కుక్కల వీరంగం చేస్తుండడంతో ప్రజలపై ఎగబడి కరుస్తూ గాయాలు పాలు చేస్తున్నాయి. ఆదివారం మండల పరిధిలోని సారపాక గ్రామపంచాయతీ గోదారమ్మ క్యాంపులో వీధి కుక్కలు సైర విహారం చేయటంతో ఒక మహిళకు తీవ్ర గాయాల దృశ్యాలు ప్రతి ఒక్కరికి కంటనీరు పెట్టించాయి. మహిళల పై వృద్ధుల పై పిల్లల పై విరుచుకుపడుతున్న వీధి కుక్కలు పై పంచాయతీ పాలకవర్గాలు చర్యలు తీసుకోవడంలో విపులమవుతున్నారని వాదనలు వినపడుతున్నాయి. సారపాక మేజర్ గ్రామపంచాయతీలో వీధి కుక్కలు, కోతులు వీధుల్లో సైర విహారం చేస్తున్నాయి.

చేతిలో కవర్ పట్టుకొని బయటకు వెళ్లడం పాపం కుక్కలు, కోతులు, మనుషులపై ఎగబడుతున్నాయి వాటిని గద్దించే క్రమంలో మనుషులపై దాడి చేస్తూ కరుస్తున్నాయి. గోదారమ్మ క్యాంపులో గత వారం రోజుల క్రితం నలుగురిని వీధి కుక్కలు కరవగా ప్రస్తుతం ఆదివారం కూడా ఒక మహిళపై దాడి చేసి కరిచాయి. తీవ్ర గాయాలతో మహిళ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వైద్యశాల అందిస్తున్నారు. వెంటనే పాలకవర్గ సభ్యులు గ్రామసభలో తీర్మానం చేసిన విధంగా వీధి కుక్కలను కోతులను త్వరగా గ్రామాల్లో లేకుండా చర్యలు చేపట్టాలని ప్రజలను కుక్కలు, కోతుల బారి నుండి రక్షించాలని వేడుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *