దక్షిణాదిలో లబ్ది పొందెందుకు బిజెపి కుట్ర పన్నుతుంది

దక్షిణాదిలో లబ్ది పొందెందుకు బిజెపి కుట్ర పన్నుతుంది

  • మంత్రి వివేక్, ఎంపీ వంశీ

చెన్నూర్, ఆంధ్రప్రభ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయ ప్రయోజనాల కోసం ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియను ఉపయోగిస్తోందని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ సంయుక్తంగా ఆరోపించారు.

సోమవారం భూపాలపల్లి కాళేశ్వరం అంత్యపుష్కర స్నానం అనంతరం చెన్నూర్ క్యాంపు కార్యాలయంలో కోటపల్లి, చెన్నూర్ మండలాల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియపై పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించారు.

ఎస్‌ఐఆర్ ప్రక్రియలో కాంగ్రెస్ బీఎల్‌వోలు చురుకుగా పాల్గొని ప్రతి ఓటరును కలిసి వివరాలు సేకరించాలని సూచించారు. ఇంటింటికీ తిరుగుతూ ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

చెన్నూర్ నియోజకవర్గంలో విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. చెన్నూర్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు.

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తూ, యువతను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తున్నారని విమర్శించారు. అలాంటి వ్యాఖ్యల కారణంగానే ఆయన ప్రస్తుతం చట్టపరమైన పరిణామాలను ఎదుర్కొంటున్నారని అన్నారు.

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ యువతను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకుల వ్యాఖ్యలను నమ్మి యువత మోసపోవద్దని సూచించారు.

Leave a Reply