డి ఆర్ డిపో, పెట్రోల్ బంకును తనిఖీ చేసిన జీసిసి డిఎం

జైనూర్, ఆంధ్రప్రభ : కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలంలోని ఉషేగావ్ నిత్యవసర వస్తువుల విక్రయ కేంద్రం (డిఆర్ డిపో) ను బుధవారం ఉట్నూర్ గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఉట్నూర్ డివిజనల్ మేనేజర్ (డీఎం) గుడిమళ్ల సందీప్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా డిపోలో బియ్యం, ఇతర సరకుల స్టాక్ రిజిస్టర్ లను పరిశీలించారు. రేషన్ కార్డ్ లబ్ధిదారులకు ఇచ్చే బియ్యం నిల్వలను ఈ పాస్ ఆన్లైన్లో సరిగ్గా ఉన్నాయో లేవో పరిశీలించారు.అనంతరం జైనూర్ మండల కేంద్రంలో జీసీసీ ద్వారా నిర్వహిస్తున్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకును సందర్శించారు.
ఇందన విక్రయాల గురించి సేల్స్ మేనేజర్ విజయను అడిగి తెలుసుకున్నారు.
డీఆర్ డిపో, పెట్రోల్ బంకు ల నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయడం తగదని డివిజనల్ మేనేజర్ ఆదేశించారు. నిత్యవసర వస్తువుల విక్రయాలను పెంచాలని, ఆదివాసి గిరిజనులు తీసుకువచ్చే ఇప్పప్పువ్వు, తేనె వంటి అటవీ ఉత్పత్తుల కొనుగోళ్లను పెంచాలని జిసిసి డిఎం ఆదేశించారు.