108 లో గర్భిణీ మహిళా ప్రసూతి..
108 లో గర్భిణీ మహిళా ప్రసూతి..
తల్లి బిడ్డ క్షేమం
జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని జెండగూడ గ్రామానికి చెందిన గర్భిణీ మహిళ సవిత 108లో మంగళవారం ప్రసూతి అయినట్లు 108 దత్తాత్రేయ, పైలెట్ మడావి బాపురావు తెలిపారు. గర్భిణి మహిళా సవితకు పురిటినొప్పులతో బాధ పడుతున్న గర్భిణికి ఉట్నూర్ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలుచేయగా మహిళా కడుపులో బిడ్డ మోషన్స్ చేస్తుందని కాన్పు కష్టమవుతుందని వైద్య అధికారుల సూచన మేరకు 108లో ఆదిలాబాద్ రిమ్స్ కి తరలిస్తుండగా మార్గమధ్యలో సీత గొంది సమీపంలో సుఖ ప్రసవమైందనివారుతెలిపారు. దీంతో 108లో తరలిస్తుండగా సీతాగొంది వద్ద నొప్పులు ఎక్కువ కావడంతో అంబులెన్స్ ఈఎంటీ దత్తాత్రేయ అంబులెన్సు రోడ్డు పక్కన నిలిపి ప్రసవం చేస్తున్నపుడు బిడ్డ కు మెడ చుట్టూ బొడ్డు తాడు ఉండడాన్ని గమనించి దానిని చాకచక్యంగా తొలగించి ప్రసవం చేశారు. సవిత మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డలను జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో చేర్పించామని ఈఎంటీ దత్తాత్రేయ, పైలెట్ మడావి బాపూరావు లు తెలిపారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని వారు తెలిపారు.
