కాళహస్తి కాలనీ చెత్త సమస్యకు పరిష్కారం ఎప్పుడు.?

కాళహస్తి కాలనీ చెత్త సమస్యకు పరిష్కారం ఎప్పుడు.?

గుడివాడ – ఆంధ్రప్రభ : గుడివాడ రూరల్ మండలం దొండపాడు రోడ్డులోని మల్లాయపాలెం గ్రామపంచాయతీ పరిధిలో గల శ్రీ కాళహస్తి కాలనీ పరిసరాలు తీవ్ర చెత్త సమస్యతో బాధపడుతున్నాయి. రహదారి పక్కనే చెత్త గుట్టలు పేరుకుపోవడంతో స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మోటూరు రోడ్డు గేటు వద్ద సంపద తయారీ కేంద్రం ఉన్నప్పటికీ, సేకరించిన చెత్తను అక్కడికి తరలించకపోవడం వలన కేంద్రం వినియోగంలో లేక ఖాళీగా మారింది. ఫలితంగా ఆ ప్రదేశాన్ని మందుబాబులు అడ్డాగా మార్చుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ట్రాక్టర్‌లు, మినీ వ్యాన్‌ల ద్వారా సేకరించిన చెత్తను రహదారి పక్కనే కాలువ గట్టు మీద పారబోస్తుండటంతో దుర్వాసన వ్యాపిస్తోంది. చెత్తను తగలబెట్టడం వలన పొగ కమ్ముకుని శ్వాసకోశ సమస్యలు తలెత్తుతున్నాయని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుక్కలు, పందులు, ఆవులు చెత్తను చిందరవందర చేస్తుండగా, కొబ్బరి బొండాలు, మాంసపు దుకాణాల వ్యర్థాలు కూడా ఇక్కడే పడేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈగలు, దోమలు విపరీతంగా పెరిగి ఆరోగ్య సమస్యలు మరింత ఉధృతమవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

Leave a Reply