ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు

ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు

ఆశాజ్యోతి ఆశ్రమంలో సేవా కార్యక్రమాలు..
వికలాంగులతో కలిసి కేక్ కట్ చేసిన చలసాని ఆంజనేయులు..
చిన్నారులకు దుస్తుల పంపిణీ…
సీఎం సేవలను కొనియాడిన విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు

విజయవాడ, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినం సందర్భంగా హనుమాన్ జంక్షన్‌లోని ఆశాజ్యోతి వికలాంగుల ఆశ్రమంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం సామాజిక బాధ్యతకు ప్రతీకగా నిలిచింది. ఆశ్రమంలో ఉన్న వికలాంగులతో కలిసి చలసాని ఆంజనేయులు జన్మదిన కేక్‌ను కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం ఆశ్రమంలోని చిన్నారులకు దుస్తులు పంపిణీ చేసి, వారి అవసరాలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా చిన్నారులతో ఆప్యాయంగా మాట్లాడి, వారికి ఉత్సాహాన్ని నింపారు.ఈ సందర్భంగా చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాధారణ రైతు కుటుంబంలో జన్మించి కృషి, పట్టుదలతో ఎదిగిన నాయకుడని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా తీర్చిదిద్దిన దూరదృష్టి కలిగిన నేతగా ఆయనను అభివర్ణించారు.

నిపుణులకంటే ముందుగానే ఆలోచించి అభివృద్ధి దిశగా అడుగులు వేసే సామర్థ్యం సీఎం చంద్రబాబులో ఉందని అన్నారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందంజలో నిలిపే లక్ష్యంతో సీఎం కృషి చేస్తున్నారని, ఆయన నాయకత్వం రాష్ట్రానికి మరింత ప్రగతిని తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఆశ్రమ నిర్వాహకులు, సేవా కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply