రంజాన్ తోఫా అందజేస్తున్న ఎమ్మెల్యే…

రంజాన్ తోఫా అందజేస్తున్న ఎమ్మెల్యే…
పాయకాపురం, ఆంధ్ర ప్రభ : మైనారిటీ కుటుంబాలకు అండగా కూటమి ప్రభుత్వం ఉందని,రంజాన్ సందర్భంగా తోఫా కిట్ల పంపిణీ చేయడం జరిగిందని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 61వ డివిజన్ శాంతి నగర్,26వ డివిజన్ కూర్మయ్య వంతెన సెంటర్, 27వ డివిజన్ దుర్గాపురం రజక కళ్యాణమండపం, 63వ డివిజన్ రాజీవ్ నగర్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద ,58వ డివిజన్ సింగ్ నగర్ వీఎంసీ షాదీఖాన ఆవరణలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు బుధవారం ముస్లిం మైనారిటీ కుటుంబాలకు రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు కఠోర ఉపవాస దీక్షలు నిర్వహిస్తున్న ఈ సమయంలో మైనారిటీ కుటుంబాలకు అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, నియోజకవర్గంలో సుమారు 10,000 మైనారిటీ కుటుంబాలు ఉన్నాయని, వీరందరికీ ఇంటింటికీ రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు.
తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ మైనారిటీలకు అండగా ఉంటుందని, గతంలో కూడా రంజాన్ సందర్భంగా తోఫాలు అందించామని గుర్తు చేశారు. కొన్ని సందర్భాల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పార్టీ నాయకులు తమ స్వంత నిధులతో కూడా సహాయం అందిస్తున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డివిజన్ మాజీ కార్పొరేటర్లు మోదుగుల తిరుపతమ్మ గణేష్,డివిజన్ అధ్యక్షుడు ఆకుల సూర్యప్రకాష్, లబ్బ వైకుంటం దుర్గా, మాచర్ల గోపినాద్ పావని,కూర్మపు దుర్గారావు,ఇంఛార్జిలు బత్తుల కొండా, మోతుకురి ఖాసిమ్,పిరియా సోమేశ్వర రావు జగదాంబ,గౌస్ బాషా,ప్రధాన కార్యదర్శి కోలా శ్రీను,తాడిశెట్టి నాగలక్ష్మి,ఎస్.కె. మస్తాన్ వలి,చిగుళ్ల దుర్గాప్రసాద్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
