చెంచు కుటుంబాలకు ప్రభుత్వ ఫలాలు..
చెంచు కుటుంబాలకు ప్రభుత్వ ఫలాలు..
- సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందించాలి
- ప్రత్యేక నిధులతో షెడ్ల నిర్మాణం పూర్తి
- పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
ముత్తారం, ఆంధ్రప్రభ : సంచార జీవులైన చెంచు కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. శుక్రవారం ముత్తారం మండలంలోని పారుపల్లి గ్రామంలో చెంచుల నివాస గృహాలను, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను, ముత్తారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ నిర్మాణ పనులను, ధర్యాపూర్ మోడల్ స్కూల్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా పారుపల్లి గ్రామంలోని సంచార జీవులైన 15 చెంచు కుటుంబాల వారికి అవసరమైన ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, అర్హులైన వారికి పెన్షన్లు ఇటీవల కలెక్టర్ చెరువుతో అధికారులు అందించారు.
పారుపల్లి మండల పరిషత్ ప్రైమరీ స్కూల్లో కలెక్టర్ చె తుల మీదుగా విద్యార్థులకు అడ్మిషన్లు అందించారు, అర్హులైన చెంచు కుటుంబాలకు కలెక్టర్ ప్రత్యేక నిధుల ద్వారా షెడ్ల నిర్మాణం పూర్తి చేశారు. చెంచు కుటుంబాల కోసం ఇప్పటికే నిర్మించిన 10 గృహాలను పరిశీలించిన కలెక్టర్, వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అనంతరం మండల పరిషత్ ప్రా థమిక పాఠశాలలో చేపడుతున్న అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను పరిశీలించారు.
పనులను వేగవంతం చేసి జూలై 31 నాటికి పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముత్తారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్, నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. దర్యాపూర్ మోడల్ స్కూల్‌ను సందర్శించిన కలెక్టర్, పాఠశాల ఎదురుగా ఉన్న ప్రభుత్వ భూమిని లెవెలింగ్ చేసి విద్యా అవసరాలకు అనుగుణంగా వి నియోగించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈకార్యక్రమంలో తహసిల్దార్ మధుసూదన్ రెడ్డి, ఎంపీడీవో సురేష్, ఏఈలు, డీలు, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
