అంబలి కేంద్రానికి రూ.25 వేల విరాళం..

అచ్చంపేట, ఆంధ్రప్రభ ; సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే అచ్చంపేట పట్టణానికి చెందిన మాజీ సర్పంచ్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గార్లపాటి సుదర్శన్ మరోసారి తన సేవాభావాన్ని చాటుకున్నారు. సోమవారం రక్షిత మహిళా సొసైటీ నిర్వహిస్తున్న అంబలి కేంద్రానికి మరో పది రోజుల పాటు రాగి అంబలి నిరుపేదలకు అందించేందుకు రూ.25,000 విలువైన చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలోని పేద మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. తమ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పలు పేద విద్యార్థినులకు కాలేజీ ఫీజుల సహాయం అందిస్తున్నామని తెలిపారు. రక్షిత మహిళా సొసైటీ సభ్యులు గార్లపాటి సుదర్శన్ సేవా కార్యక్రమాలను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక అడ్వకేట్ మస్తాన్, రక్షిత మహిళ సొసైటీ సభ్యులు చెపూరి జయమ్మ, మాధవి తదితరులు పాల్గొన్నారు.
