మీ ఆడ బిడ్డగా నన్ను ఆశీర్వదించండి..

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంగడి రజిత క్రిష్ణ
మీ ఆడ బిడ్డగా నన్ను ఆశీర్వదించండి..
-చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపించండి.
-నిరంతరం ప్రజా సేవే లక్ష్యంగా పనిచేస్తాను
-గెలిచిన వెంటనే హామీలను అమలు చేస్తాను.
-గల్లీల్లో సీసీ రోడ్లు, మోరీలు, పైప్‌లైన్ల ఏర్పాటు చేస్తాను
-ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణలో మినీ వాటర్ ట్యాంక్ ఏర్పాటు
-కరెంట్ పోల్స్, విద్యుత్ సదుపాయాలను కల్పిస్తాను
-మహిళా సంఘానికి సొంత భవనం నిర్మాణానికి చర్యలు
-అర్హులందరికీ రేషన్ కార్డులు, పింఛనులు, సంక్షేమ పథకాలు
-అందరికి నిరంతరం అందుబాటులో ఉంటాను
-16వ వార్డులో కాంగ్రెస్ జెండా గెలుపు ఖాయం
స్టేషన్ ఘన్ పూర్, ఫిబ్రవరి4 ఆంధ్రప్రభ: మొదటిసారి రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న నాకు ఒక అవకాశం ఇవ్వండి…మాటలతో కాదు, పనులతో అభివృద్ధి చేసి చూపిస్తాను.
ఒక ఆడబిడ్డగా, మీ ఇంటి బిడ్డగా అందరినీ మనస్ఫూర్తిగా అడుగు తున్నాను..మీ ఆశీర్వాదమే నా బలమని స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపా లిటీలోని 16వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అంగడి రజిత క్రిష్ణ పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా బుధ వారం అభ్యర్థి వార్డులోని నెలకొన్న పలు సమస్యలను గుర్తించి, పరిష్కారానికి హామీలు ప్రకటిం చారు. గెలిచిన వెంటనే ఎమ్మెల్యే సహకారంతో వార్డు మొత్తం అభివృ ద్ధి పనులు చేపడతానని తెలిపారు. వార్డు వ్యాప్తంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, వాటర్ పైప్‌లైన్ పనులు పూర్తి చేసి ప్రతి వీధిలో వీధి దీపాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించి, వృద్ధులు, వితంతులకు పెన్షన్లు అందేలా కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ హాస్పిటల్ వెనుక భాగం నుంచి యాదవ్ గల్లీ, కారు ప్రభాకర్ ఇంటి ముందు సైడ్ ద్వారా రైల్వే కాలనీ వరకు మురికి నీటి మోరీలను అను సంధానం చేసి, అదే మార్గం లో సీసీ రోడ్డు ఏర్పాటు చేస్తామని తెలి పారు. అలాగే నాగార్జున, బాల కృష్ణ ఇంటి నుంచి రైల్వే కాలనీ మురికి నీటి మోరీలకు కలిపి సీసీ రోడ్డు నిర్మాణం చేస్తామని చెప్పారు. యువత అవసరాలను దృష్టిలో ఉంచు కుని లైబ్రరీ ఏర్పాటు చేయడం తో పాటు, ప్రభుత్వ హాస్పిటల్ సమీపం లో మినీ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. జంగాల కాలనీ చౌరస్తా వద్ద సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు, వడ్ల కమ్మరి వాడలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే సహ కారంతో పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. వార్డు అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తన లక్ష్యమని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఆశీర్వదించాలని అంగడి రజిత కృష్ణ ప్రజలను కోరారు.
