సఫాయి కార్మికుల కాంటాక్ట్ పద్ధతి ఎత్తివేయాలి

సఫాయి కార్మికుల కాంటాక్ట్ పద్ధతి ఎత్తివేయాలి

పరకాల, ఆంధ్రప్రభ : సఫాయి కార్మికుల కాంట్రాక్టు పద్ధతిని ఎత్తివేయాలని డిమాండ్లతో జాతీయ సఫాయి కర్మ చారిస్ వైస్ చైర్ పర్సన్ హార్దిప్ సింగ్ గిల్ ని కలిసిన (తెలంగాణ సఫాయి) ఆల్ ఇండియా సఫాయి మజ్దూర్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ బృందం జాతీయ కార్యదర్శి సోదా రామకృష్ణ వినతి పత్రం అందజేశారు. నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైస్ చైర్ పర్సన్ హార్థిప్ సింగ్ గిల్ ని ఢిల్లీలోని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ సఫాయి, ఆల్ ఇండియా సఫాయి మజ్దూర్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ బృందం, అనంతరం వారిని కలిసి సఫాయి కార్మికుల వేతనాల విషయాల గురించి, విద్యార్థుల విద్య భవిష్యత్తు గురించి, తెలంగాణ రాష్ట్రంలో మరియు దేశంలో సఫాయి కార్మికులకు ఔట్ సోర్సింగ్ తీసివేసి నేరుగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని, సఫాయి కార్మికుల వ్యవస్థలో కాంట్రాక్టు పద్ధతిని తీసివేసి వారికి ప్రభుత్వపరంగా వేతనాలు చెల్లించాలని ముఖ్యమైన డిమాండ్లతో తెలంగాణ సఫాయి యూనియన్ ప్రతినిధి బృందం రాజేష్ పరచ నేతృత్వంలో ఆల్ ఇండియా సఫాయి మజ్దూర్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ జాతీయ కార్యదర్శి సోదా రామకృష్ణ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ పరచ , రాష్ట్ర ఉపాధ్యక్షులు కారం వీర్ సింగ్ గారు, హైదరాబాద్ సిటీ అధ్యక్షులు దేవేందర్ సింగ్ చిండాలియాను కోరారు.