అభివృద్ధి పథంలో పోచంపల్లి గ్రామం..

అభివృద్ధి పథంలో పోచంపల్లి గ్రామం..

రేగొండ, ఆంధ్రప్రభ : రేగొండ మండలంలోని పోచంపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిని, గ్రామ పంచాయతీ పాలకవర్గ సిబ్బందిని పోచంపల్లి సర్పంచ్ కేసిరెడ్డి సబిత-ప్రతాప్ రెడ్డి సన్మానించారు. గ్రామపంచాయితీలో ఉన్నటువంటి సమస్యలు అయినా శానిటేషన్, బ్లీచింగ్ మురికి కాలువల శుభ్రత గ్రామాన్ని అభివృద్ధి పథంలో ఉంచుతూ గ్రామ అభివృద్ధికి పాటుపడుతూ గ్రామపంచాయతీ పాలకవర్గం నిరంతరం సేవలందిస్తూ పోచంపల్లి గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నందుకు వీరి సేవలను గుర్తిస్తూ ఆదివారం గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని సర్పంచ్ సన్మానించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి. పింగిలి జ్యోతి,ఉపసర్పంచ్. ముద్దమల్ల రవి,వార్డ్ మెంబెర్స్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply