Visakha Steel Plant Accident | KGHలో బాధితులను పరామర్శించిన లోకేశ్

Visakha Steel Plant Accident | KGHలో బాధితులను పరామర్శించిన లోకేశ్

Visakha Steel Plant Accident | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో గాయపడిన కార్మికులను, వారి కుటుంబ సభ్యులను రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ పరామర్శించారు. విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆస్పత్రి (KGH)కి చేరుకున్న ఆయన బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

గాయపడిన కార్మికుల కుటుంబ సభ్యులతో మాట్లాడిన లోకేశ్.. ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి అధికారులకు సూచించినట్లు సమాచారం. ఈ విషాద ఘటనలో గాయపడిన వారి కుటుంబ సభ్యులకు లోకేశ్ ధైర్యం చెప్పారు. ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఆస్పత్రి సందర్శన అనంతరం విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని కూడా మంత్రి లోకేశ్ పరిశీలించనున్నట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు, భద్రతా పరిస్థితులపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది.