Scooter Accident | స్కూటర్ అదుపు తప్పి కిందపడి ముగ్గురికి గాయాలు
Scooter Accident | స్కూటర్ అదుపు తప్పి కిందపడి ముగ్గురికి గాయాలు
ఇద్దరికి తీవ్ర గాయాలు
జాతరకు వచ్చి వెళుతూ ప్రమాదం
ఒకే స్కూటర్ పై నలుగురు ప్రయాణం
Scooter Accident | సుండుపల్లె (వై యస్ ఆర్ కడప, ఆంధ్రప్రభ : వై యస్ ఆర్ కడప జిల్లా సుండుపల్లె మండల పరిధిలో జరిగిన నాగారపమ్మ జాతరకు వచ్చి తిరిగి వెళ్లే సమయంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు గాయాలపాలయ్యారు. వివరాల లోకి వెళితే సుండుపల్లె మండల పరిధిలోని పెడినేనికాలువ పంచాయతీ బండకాడఈడిగ పల్లె సమీపంలో జరిగిన నాగారపమ్మ జాతరకు వెళ్లి తిరిగి ఒకే స్కూటర్ పై మల్లిఖార్జున, ఆసిఫ్, బాబ్జాన్ అనే ముగ్గురు యువకులు మరో యువకుడితో కలిసి వెళుతుండగా బూడిదేటి పల్లె సమీపంలో స్కూటర్ అదుపు తప్పి కింద పడడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పీలేరు ఇందిరమ్మ కాలనీ కి చెందిన మల్లిఖార్జున (26)కు కుడికాలు తొడ వద్ద ఎముక విరిగినట్లు, సుండుపల్లె కు చెందిన ఆసిఫ్ (16)కు కుడి కాలు మోకాలు వద్ద తీవ్ర గాయాలు కాగా, సుండుపల్లె కె చెందిన బాబ్జాన్ (22)అనే యువకుడికి స్వల్ప గాయాలు అయినట్లు 108 వాహన సిబ్బంది తెలిపారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న 108వాహన సిబ్బంది వెంటనే రద్దీ గా వున్న జాతర ట్రాఫిక్ లోనే అక్కడికి చేరుకుని స్థానికుల సహకారంతో గాయపడ్డ వారిని వాహనంలోకి చేర్చి ప్రాధమిక చికిత్స చేస్తూ రాయచోటి ప్రాంతీయ
వైద్యశాలకు తరలించారు. ఈ సందర్బంగా పలువురు 108సిబ్బందిని అభినందించగా, గాయపడ్డ వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
