ఆర్మీ జవాన్ బొమ్మేన విశాల్‌ కు ఘన సన్మానం

ఆర్మీ జవాన్ బొమ్మేన విశాల్‌ కు ఘన సన్మానం

​దండేపల్లి, ఆంధ్రప్రభ : ఆర్మీ ఉద్యోగానికి ఎంపికైన దండేపల్లి యువకుడు బొమ్మేన విశాల్ ను తెలంగాణ వాల్మీకి బోయ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. బుధవారం స్థానిక వాల్మీకి బోయ సంఘం భవనంలో విశాల్‌ను శాలువాలు, పూలమాలలతో ఘనంగా అభినందించారు.​ ఈ సందర్భంగా వాల్మీకి బోయసంఘం నాయకులు మాట్లాడుతూ, విశాల్ ఆర్మీకి ఎంపిక కావడం తమ కులానికి గర్వకారణమని, నేటి యువతకు అతను ఆదర్శంగా నిలిచాడని కొనియాడారు.

కష్టపడితే ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చని విశాల్ నిరూపించారని పేర్కొన్నారు. తన విజయంలో భాగస్వాములైన తల్లిదండ్రులు చంద్రమౌళి, భాగ్యలకు వారు అభినందనలు తెలియజేశారు.​ఈ కార్యక్రమంలో బొమ్మేన లక్ష్మిరాజాం, కాముటం రామన్న, బొమ్మేన మల్లేష్, బంగారి రాజు, బొమ్మేన చంద్రయ్య, సత్తన్న, గంగాధర్, మహేష్, గోపి, విశాల్, శుశాంత్, అడప సంతోష్, ముస్కె సురేష్, నర్సవ్వ, లావణ్య, ఆధ్విక సంఘసభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.