village people | సేవే మార్గం.. అభివృద్ధి లక్ష్యం

village people | సేవే మార్గం.. అభివృద్ధి లక్ష్యం

village people | దండేపల్లి, ఆంధ్ర‌ప్ర‌భ : మండలంలోని కాసిపేట గ్రామ సర్పంచ్ ప‌ద‌వికి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి లక్కాకుల వనిత సృజన్ ఎన్నికల బరిలో నిలిచాడు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ(Congress party) ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు(MLA Kokkirala Prem Sagar Rao) కాసిపేట గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ఆయన బలపరిచిన స‌ర్పంచ్ అభ్య‌ర్థి లక్కాకుల వనిత సృజన్ ను గెలిపించాల‌ని కోరారు.

వ‌నితి సృజ‌న్‌ను గెలిపిస్తే గ్రామ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ గ్రామానికి అధిక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద‌ల‌కు అన్ని విధాలుగా తోడుంటుందని అన్నారు. గ్రామంలోఎలాంటి వివాదాలు తలెత్తకుండా చూస్తూ గ్రామ ప్రజల(village people) ఆదరాభిమానాలు ఉండాలని గ్రామ ప్రజలను కోరారు.

అనంతరం ద్వారక, ధర్మ రావు పేట గ్రామాలలో ఓటర్లను కలిసి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేయాలని అభ్య‌ర్థించారు. ఈ కార్యక్రమంలో జ‌డ్పీటీసీ మాజీ స‌భ్యుడు గడ్డం నాగరాణి, మాజీ, అక్కల శకుంతల, రాజీవ్ సంఘటన్ జిల్లా అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, సర్పంచ్ అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply