Warangal | పెన్షనర్స్ డే వేడుకలు..

Warangal | పెన్షనర్స్ డే వేడుకలు..

Warangal, కరీమాబాద్, ఆంధ్రప్రభ : నేడే పెన్షనర్స్ డే వేడుకలు వరంగల్ నగరంలో ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయని పెన్షనర్స్ రాష్ట్ర కార్యదర్శి రామ మనోహర్, జిల్లా అధ్యక్షుడు తుమ్మ వీరయ్య తెలిపారు. జిల్లా శాఖ ఇన్నర్ వీల్ ఫంక్షన్ హాల్ కొత్తవాడ వరంగల్ లో పెన్షనర్స్ డే & నూతన సంవత్సర డైరీ 2026 క్యాలండర్ ఆవిష్కరణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని వరంగల్ జిల్లా అధ్యక్షుడు తుమ్మ వీరయ్య, ప్రధాన కార్యదర్శి గునిగంటి సాంబయ్య తెలిపారు. జిల్లాశాఖ కార్యవర్గ సభ్యులు, యూనిట్ కార్యవర్గ సభ్యులు, సంఘ ప్రాథమిక సభ్యులు పాల్గొనాలని కార్యక్రమ నిర్వహణ కమిటీ సభ్యులు తనవంతు బాధ్యతలు సహకారం అందించాలి అన్నారు.

ఈనాటి కార్యక్రమాలకు రాష్ట్ర శాఖ అధ్యక్షులు ఏ రాజేంద్ర బాబు, కార్యదర్శి ఎం.వి.నరసింగరావు, అసోసియేట్ అధ్యక్షులు జి.వీరస్వామి, అదనపు ప్రధాన కార్యదర్శి వెలిశోజు రామ మనోహర్, ఆర్థిక కార్యదర్శి బి.నరసయ్య, ఉపాధ్యక్షులు కర్రు సుధీర్ బాబు, టీ. పురుషోత్తం, రాష్ట్ర సలహా దారులు ఇ.నర్సింహారెడ్డి పాల్గొంటున్నారు. కావున అందరు సకాలంలో విచ్చేసి విజయవంతం చేయాలని జిల్లా శాఖ అధ్యక్షులు తుమ్మ వీరయ్య, ప్రధాన కార్యదర్శి గునిగంటి సాంబయ్య, ఆర్థిక కార్యదర్శి నిమ్మకాయల సదానందం, అసోసియేట్ అధ్యక్షులు పెట్లోజు పరమేశ్వర్ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply