తల్లీ కొడుకు పీకలు కోశారు..
- కుమారుడు మృతి.. విషమంలో తల్లి
- పల్నాడు జిల్లాలో దారుణం
- నిందితులు మైనర్లే
ఆంధ్రప్రభ, పల్నాడు బ్యూరో : సత్తెనపల్లి మండలం దూళ్లిపాళ్ళలో దారుణం జరిగింది. ఆదివారం మధ్యాహ్నం తల్లి , కోడుకుపై కొందరు దుండగులు కత్తితో దాడి చేశారు. తల్లి, కుమారుడి గొంతు కోశారు. ఈ దాడిలో కుమారుడు సాంబశివరావు మృతి చెండాడు. తల్లి కృష కమారి పరిస్థితి విషమంగా ఉంది. అనుమానుతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
నకరికల్లు మండలం చాగల్లు గ్రామం సమీపంలో అనుమానితులను పోలీసులు అదుపులో తీసుకోగా.. అక్కడ గ్రామస్తులకు మధ్య తోపులాట జరిగింది. హంతకులను తమకు అప్పగించాలని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితలను చితకబాదేందుకు గ్రామస్తులు ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు కాగ, ముగ్గురూ మైనర్లు కావటం విశేషం. హత్యకు కారణాలు ప్రస్తుతం సస్పెన్స్ .


Pingback: Palnadu Mu*der| అక్క కళ్లల్లో నీళ్లు చూడలేక... - Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana