వెలుగల్లు ప్రాజెక్టులో విషాదం..
వెలుగల్లు ప్రాజెక్టులో విషాదం..
నీటిలో మునిగి యువకుడు మృతి
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని నిజాం వలీ క్వార్టర్స్‌కు చెందిన నాసిర్ అనే యువకుడు సోమవారం అన్నమయ్య జిల్లా గాలివీడు సమీపంలోని వెలుగల్లు ప్రాజెక్టు వద్ద నీటిలో మునిగి మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది.
స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది మృతదేహాన్ని నీటిలో నుంచి బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
