41 Notices | రూ.లక్ష లంచంతో…

41 Notices | రూ.లక్ష లంచంతో…
ఏసీబీ వలలో ఇద్దరు ఎస్ఐలు
41 Notices | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రూ.లక్ష లంచం తీసుకుంటూ ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇద్దరు సబ్ ఇన్‌స్పెక్టర్లు ఏసీబీ అధికారుల చేతికి చిక్కారు. బాబునాయక్, ప్రమోద్ అనే ఈ ఇద్దరు ఎస్ఐలు ఓ సైబర్ కేసులో నిందితుడికి 41 నోటీసులు ఇచ్చేందుకు లంచం అడిగినట్లు ఫిర్యాదు అందిన తర్వాత ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఫిర్యాదుదారు నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఎల్బీనగర్ సైబర్ పీఎస్‌లో సోదాలు చేసి కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్ సైబర్‌క్రైమ్ పీఎస్‌లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
