“No Stock” Boards | అధికారులకు మంత్రి నాదెండ్ల ఆదేశం

“No Stock” Boards | అధికారులకు మంత్రి నాదెండ్ల ఆదేశం
“No Stock” Boards | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో గత రెండు, మూడు రోజులుగా ఇంధన కొరత వేధిస్తోంది. కొన్ని జిల్లాల్లో పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా డీజిల్ కొరత ఎక్కువగా ఉంది. బంకులు మూసివేయడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉన్న బంకుల్లో వాహనదారులు బారులు దీరారు. దీనిపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎక్కడా సమస్యలు రాకుండా చూడాలని ఆదేశించారు. ఆయిల్ కంపెనీలు, డీలర్ల ప్రతినిధులతో అధికారుల వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. ఇంధన కొరత ఉన్న నేపథ్యంలో కంపెనీలు సమర్థంగా పని చేయాలని, వినియోగదారులకు అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు. సరఫరాలో తలెత్తిన ఇబ్బందులను అధిగమించాలన్నారు. ఆయిల్ కంపెనీల డిపోల్లో అధికారులు తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. నిల్వలపై వివరాలను సేకరించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.
