01-June-Iran-Reopens : ఖుల్ జా.. సిమ్ సిమ్ Andhra Prabha Top Story
01-June-Iran-Reopens : ఖుల్ జా.. సిమ్ సిమ్ Andhra Prabha Top Story
- ఇరాన్ యమ బిజీ
- భూగర్భ స్థావరాల్లో వర్క్ షురూ
- 5 సొరంగాలు రెడీ
- ఐదు సొరంగ మార్గాలు సిద్ధం.. క్షిపణి సామర్థ్యానికి పునర్జీవం
- భూగర్భ ఆయుధాగారాల్లో ఇంకా వెయ్యి క్షిపణుల నిల్వ?
- యుద్ధం మళ్లీ వస్తే ఇరాన్ వ్యూహం ఏంటి?
- ట్రంప్ లక్ష్యం ఇరాన్ క్షిపణి శక్తి నిర్వీర్యమే
- మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న భద్రతా ఆందోళనలు
- పెంటగాన్ మౌనం.. ప్రపంచ దేశాల్లో ఉత్కంఠ
(ఆంధ్రప్రభ, వాషింగ్టన ప్రతినిధి)

హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవటమే.. ప్రధాన టార్గెట్ గా.. ఒక తాత్కాలిక ఒప్పందం అత్యవసరం అని ఇరాన్, అమెరికా పైకి చెబుతున్నా.. ఈ ఒప్పందాన్ని ఖరారు చేయడానికి ఇంకా ఎంత కాలం వేచి చూడాలో.. అర్థం కాక ప్రపంచ దేశాలు సతమతం అవుతున్నాయి, దాదాపు ₹ 90 లక్షల కోట్లు ఖర్చు చేసి ఇరాన్ పై బాంబుల వర్షం కురిపించిన అమెరికాకు ఇప్పటికీ కంటిమీద కునుకు లేదు. ఇరాన్ భూగర్భం అంతరాల్లోని క్షిపణి స్థావరాలను మట్టుపెట్టామని ఓ వైపు అమెరికా, ఇజ్రాయెల్ గొప్పలు పోతుంటే… కాల్పుల విరమణ ప్రారంభమైన ఈ 54 రోజుల్లో .. ఇరాన్ తన పని తాను చేసుకు పోతోంది. తన భూగర్భంలో దాచిన 1000 క్షిపణులకు పునః ప్రాణం పోతోస్తోంది. ఈ పరిణామాలు యుద్ధానికే దారి తీస్తాయని యుద్ధ నిపుణులు ఆలదోళన వ్యక్తం చేస్తున్నారు.
01-June-Iran-Reopens :ఇరాన్ బిజీబిజీ

పర్వత శ్రేణిలో భూగర్భంలో పాతిన ఆయుధాగారాలను ఇరాన్ అతివేగంగా యాక్తివేట్ చేస్తోంది. ఈ భూగర్భ వెపన్ బ్యాంకును తెరిచిన వెంటనే ఇజ్రాయెల్ , అమెరికా సన్నిహిత మధ్యప్రాచ్య దేశాలపై సుదూర క్షిపణులను పంధించటానికి ఇరాన్ సిద్ధంగా ఉందని అమెరికా నిఘా వర్గాలు పసిగట్టాయి.
నిజానికి కొన్ని వారాలుగా, తమ భీకర దాడుల్లో ఇరాన్ లోని రోడ్లను అమెరికా ఇజ్రాయెల్ ధ్వంసం చేశాయి. సొరంగ మార్గాలను పూడ్చివేశాయి. ఈ స్థితిలో తన భూగర్భ క్షిపణి స్థావరాలకు ఇరాన్ చేరుకోకుండా నిరోధించాయి. కానీ, ఈ దాడుల్ల విధ్వంసం నుంచి కోలుకోవటానికి తాజాగా బుల్డోజర్లు, డంపింగ్ ట్రక్కులను ఇరాన్ ప్రయోగిస్తోంది. సొరంగాలను తిరిగి తెరిచే క్రతువును ప్రారంభించింది. కేవలం సొరంగ దారులే లక్ష్యంగా చేసుకొని లక్షల కోట్ల ఖర్చు భరించినప్పటికీ… ఇరాన్ క్షిపణి సామర్థ్యాన్ని నాశనం చేయటం అసాధ్యమని తాజా పరిణామాలు నిరూపిప్తున్నాయని నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఇరాన్‌లోని డెజ్‌ఫుల్ సమీపంలోని భూగర్భ క్షిపణి స్థావరంలోని 5 సొరంగ మార్గాల్లో నాలుగింటిని మే 12న తిరిగి తెరుచుకున్నాయి. ఒక వైపు యుద్ధం జరుగుతున్న తరుణంలో భూగర్భ క్షిపణి స్థావరాలపై అమెరికా ఇజ్రాయెల్ తరచుగా దాడులు చేస్తున్నప్పటికీ, ఇరాన్ మాత్రం సొరంగ మార్గాలను తవ్వడానికి కృషి చేసింది. యుద్ధం పొడవునా తన క్షిపణులను ప్రయోగించడానికి ఇరాన్ వీలు కల్పించింది, క్షిపణుల ప్రయోగం రేటు చాలా వరకు తగ్గింది. కాల్పుల విరమణ ప్రారంభమైన ఈ ఏడు వారాల్లో తన , స్థావరాలను తిరిగి తవ్వడానికి ఇరాన్ తన పనిలో వేగం పెంచింది. 18 భూగర్భ క్షిపణి స్థావరాలను అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో దెబ్బతినగా.. 69 సొరంగ మార్గాల్లో అయిదింటిని తిరిగి తెరిచింది. క్షిపణి ప్రయోగ లాంచర్లను నిరోధించేందుకు అమెరికా, ఇజ్రాయెల్ తమ బాంబులతో ధ్వంసం చేసిన రోడ్లతో సహా, స్థావరాలలోని ఇతర భాగాలను కూడా ఇరాన్ మరమ్మతులు చేసింది. ఇక్కడ ఏర్పడిన గోతుల్లో దాదాపు అన్నింటినీ ఇరాన్ పూడ్చివేసింది. రెండు చోట్ల రోడ్లను తిరిగి నిర్మించింది.
01-June-Iran-Reopens :అది విధ్వంసమే… కానీ

అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఇరాన్ స్థావరాలను తీవ్రంగా దెబ్బతీశాయి, చాలా సొరంగ మార్గాలను పర్వత శిథిలాల కింద పూడ్చిపెట్టాయి ఆ ప్రదేశాలకు దారితీసే రహదారులను ధ్వంసం చేశాయి. కీలక భూగర్భ క్షిపణి స్థావరం ఇస్ఫహాన్ నార్త్ మిస్సైల్ బేస్ సౌకర్యాలు బహుళ దాడులతో ధ్వంసమైనట్లు ఉప గ్రహ చాయా చిత్రాల్లో కనిపించాయి. శిథిలాలతో సొరంగాలు మూసుకు పోగా , అదే విధంగా క్షిపణి లాంచర్లు నాశనమయ్యాయి. ఇరాన్ క్షిపణి సరఫరా గొలుసును నాశనం చేయటానికి అమెరికా ఇజ్రాయెల్ విశ్వ ప్రయత్నాలు చేశాయి. ఇందులో చిన్న ఎలక్ట్రానిక్ భాగాలు ఉత్పత్తి అయ్యే కర్మాగారాల నుంచి , రాకెట్ ఇంధనాలు క్షిపణి బాడీలు తయారు చేసే ప్రదేశాలనూ వదల్లేదు. భూగర్భ స్థావరాలలో ఇరాన్ వద్ద ఇప్పటికీ సుమారు 1,000 క్షిపణులు నిల్వ ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, భూమి ఉపరితలం కింద చాలా లోతులో ఉన్న ఆ నిల్వకు, భూమిపై జరిగిన దాడుల వల్ల పెద్దగా నష్టం జరిగి ఉండే అవకాశం లేదు. ముఖ్యంగా, గత సంవత్సరం జరిగిన ట్వెల్వ్-డే వార్ (12 రోజుల యుద్ధం) సమయంలో ఇజ్రాయెల్ సైన్యం సొరంగాల ప్రవేశ ద్వారాలపై ఇదే పద్ధతిలో దాడి చేసిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇది మరింత స్పష్టమవుతుంది.
01-June-Iran-Reopens :ఖుల్ జా సిమ్ సిమ్..

అమెరికా ఇజ్రాయెల్ బాంబుల దాడిలో ఇరాన్‌లోని కెర్మాన్‌షాకు ఉత్తరాన ఒక క్షిపణి స్థావరంలోని రెండు సొరంగ మార్గాలు తిరిగి తెరుచుకున్నాయి. క్షిపణి లాంచర్లు దూసుకెళ్లకుండా నిరోధించే గుంతలు , సొరంగాల రహదారులకు మరమ్మత్తులు చేసి, తిరిగి ఇరాన్ నిర్మించింది. ఆ స్థావరాలను తిరిగి తెరవడానికి, ఇరాన్ రకరకాల నిర్మాణ మట్టిని తవ్వే యంత్రాలను ఉపయోగించింది. ఉపగ్రహ చిత్రాలలో, ఫ్రంట్-ఎండ్ లోడర్లు శిథిలాలను తొలగిస్తుండగా, డంప్ ట్రక్కులు గుంతలను మట్టితో నింపడం కనిపిస్తుంది. ఇస్ఫహాన్ వెలుపల ఒక స్థావరంలో, యుద్ధ సమయంలో నాలుగు సొరంగ ప్రవేశ ద్వారాలను మూసివేయడానికి అమెరికా ఇజ్రాయెల్ అనేక దాడులు నిర్వహించాయి. ఆ ప్రవేశ ద్వారాలలో రెండింటి వద్ద కనీసం 18 ః గొయ్యిలు కనిపించాయి, ఇది సొరంగాలను మూసివేయడానికి ఎంతటి ఆయుధ సామగ్రిని ఖర్చు చేశారో సూచిస్తుంది. ఇరాన్‌లోని ఖొమేయిన్ సమీపంలో ఉన్న ఒక భూగర్భ క్షిపణి స్థావరం లో ఏప్రిల్ 15, 2026న ఒక సొరంగం మార్గాన్ని శుభ్రం చేయడానికి కనీసం 10 నిర్మాణ వాహనాలను వినియోగించారు. ఇరాన్ తన క్షిపణులను తిరిగి పొందుతూ, తన క్షిపణి స్థావరాల కార్యాచరణను పునరుద్ధరిస్తున్నప్పటికీ, ఈ ఆయుధాగారం వల్ల కలిగే నిరంతర ముప్పును తక్కువగా అంచనా వేస్తున్నారని విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు,
01-June-Iran-Reopens :యుద్ధమే లక్ష్యం

ఇరాన్ దగ్గర క్షిపణి ఆయుధాగారమే యుద్ధానికి ఒక కారణం అని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పదేపదే అంటున్నారు. ఆయుధగారాన్ని నాశనం చేయడమే లక్ష్యాల్లో ఒకటిగా తెలిపారు. ట్రూత్ సోషల్‌లో మార్చిలో చేసిన ఒక పోస్ట్‌లో, ట్రంప్ యుద్ధం ఐదు “లక్ష్యాలలో” ఒకటిగా “ఇరాన్ క్షిపణి సామర్థ్యం, ప్రయోగ వాహనాలు, ఆయముధాలను పూర్తిగా నిర్వీర్యం చేయటమే లక్ష్యంగా పేర్కొన్నారు. 20 ఏళక్ల కిందట ఇరాన్ ప్రారంభించిన భూగర్భ క్షిపణి స్థావరాల నెట్‌వర్క్, క్షిపణులకు, ప్రయోగ వాహనాలకు గణనీయ రక్షణను అందిస్తోంది. ఈ సౌకర్యాలు చాలా లోతుగా ఉండటమే కాదు, వాటిలో కొన్ని వందల మీటర్ల రాతి పొరల కింద భద్రపర్చటంతో , ఈ స్థావరాలపై దాడికి అమెరికా ఇజ్రాయెల్ సైన్యాల శక్తి సరిపోలేదు.
01-June-Iran-Reopens :ఒక వేళ యుద్దం వస్తే…

“ఒకవేళ యుద్ధం తిరిగి ప్రారంభమైతే, ఉత్పత్తి నిలిచిపోయినప్పటికీ, తమ వద్ద ఉన్న లాంచర్లు, సిబ్బందితోనే ఇరాన్ క్షిపణులను ప్రయోగిస్తుందని ఇరాన్ క్షిపణి సామర్థ్యాలను విశ్లేషించే జేమ్స్ మార్టిన్ సెంటర్ ఫర్ నాన్‌ప్రొలిఫరేషన్ స్టడీస్‌లోని పరిశోధనా సహాయకుడు సామ్ లేర్ అభిప్రాయపడ్డారు, ఇరాన్ వద్ద అపార క్షిపణుల నిల్వలతో లాంచర్లకు ఆయుధాలు సమకూర్చడాన్ని నిరోధించే శక్తి ఎవరికీ లేదని ఆయన అన్నారు.
“వ్యూహాత్మక విజయాలు సాధించడంలో అమెరికా సైన్యం చాలా సమర్థవంతమైంది, ఇరాన్ క్షిపణి దళాన్ని నిర్వీర్యం చేసి, అణచివేయడం ఇందుకు ఒక గొప్ప ఉదాహరణ,” అని లేర్ అన్నారు. “అయితే, దీనికి సహేతుక వ్యూహాత్మక యుద్ధ లక్ష్యాలు, సాధించగలిగే విజయ సిద్ధాంతం తోడవకపోతే, అది వ్యూహాత్మక వైఫల్యంగా ముగియవచ్చు.” అని వివరించారు.
01-June-Iran-Reopens :పెంటగాన్ మౌనం

పెంటగాన్ ప్రతినిధి షాన్ పార్నెల్ స్పందించలేదు. “అమెరికా సైన్యం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనది, అధ్యక్షుడు ఎంచుకున్న సమయం ప్రదేశంలో దాడి చేయడానికి అవసరమైనవన్నీ దాని వద్ద ఉన్నాయి” అనే తన మునుపటి ప్రకటననే ఆయన పునరావృతం చేశారు. ఏప్రిల్ 8న అమెరికా, ఇరాన్‌లు కాల్పుల విరమణకు అంగీకరించిన తర్వాత, అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఈ ప్రయత్నాలను ప్రస్తావిస్తూ, “వాటి స్థానంలో కొత్తవి పెట్టే సామర్థ్యం లేకుండా, ఇరాన్ తన వద్ద మిగిలి ఉన్న లాంచర్లు, క్షిపణులను తవ్వి తీస్తోంది. ఇక ఇరాన్ కు రక్షణ పరిశ్రమ లేదు” అని అన్నారు.
ALSO READ : May-31-Success-Story : ఫ్యాక్షన్ పీడ వీడి ..Andhra Prabha Top Story
