గ్రామాల అభివృద్ధే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బొజ్జు పటేల్
గ్రామాల అభివృద్ధే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బొజ్జు పటేల్
ఉట్నూర్, ఆంధ్రప్రభ:
గ్రామాల అభివృద్ధే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. సోమవారం ఆయన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని మ్యాదరి వాడలో సిమెంట్ రోడ్లు, మురికి కాలువల అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మాట్లాడుతూ అభివృద్ధి పనులను త్వరితగతిన, నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. గ్రామాభివృద్ధి సాధనలో అధికార పార్టీ కృషి కీలకమని, ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీసీసీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఏక్బాల్, డీసీసీ ఉపాధ్యక్షులు లింగంపల్లి చంద్రయ్య, ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అనిత శ్రీనివాస్ జాదవ్, జైనూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బానోత్ జైవంత్ రావ్, ఉట్నూర్ ఉపసర్పంచ్ మస్రత్ బేగం, అన్సార్ అలీ, ఉట్నూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు డా. దాసండ్ల ప్రభాకర్, ఉట్నూర్ సహకార చైర్మన్ ఎస్.పీ.రెడ్డి చంద్రయ్య, ఉట్నూర్ టౌన్ ప్రెసిడెంట్ నిస్సార్, వార్డు సభ్యులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
