Utnoor | హామీని నిలబెట్టుకున్న కలెక్టర్ ..

Utnoor | హామీని నిలబెట్టుకున్న కలెక్టర్ ..

  • హస్నాపూర్ పాఠశాలకు 50 బెంచీలు అందజేత

Utnoor | ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని హస్నాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హస్నాపూర్ లో ఇటీవల జరిగిన గణిత మేళా ప్రోగ్రామ్ కు అదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిష‌ సంద‌ర్శించారు. అప్పుడు ప్రధాన సమస్య విద్యార్థులకు కూర్చోడానికి బెంచీలు లేవని ఉపాధ్యాయులు కలెక్టర్ కు విన్నవించారు. కలెక్టర్ రాజర్షిష స్పందించి ఉట్నూర్ లోని కేజీబీవీ పాఠశాలలో అదనంగా ఉన్న‌ 50 డెస్క్ బెంచీలను హస్నాపూర్ పాఠశాలకు ఇచ్చారని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఈ రోజు తెలిపారు. కలెక్టర్ ఆదేశాలతో తమ పాఠశాలకు బెంచీలు రావడానికి కృషి చేసిన ఆదిలాబాద్ జిల్లా విద్యాధికారి రాజేశ్వర్ కు, ఉట్నూర్ మండల విద్యాధికారి ఆశన్నకు, సెక్టోరల్ అధికారి రఘు రమణకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిరుపతి, పాఠశాల సీనియర్ గణిత ఉపాధ్యాయులు అజయ్ పవార్ లు ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply