విద్యార్థి బలవన్మరణం..

విద్యార్థి బలవన్మరణం..

జైపూర్, ఆంధ్రప్రభ : ఆర్థిక సమస్యల వల్ల తను తల్లిదండ్రులకు భారమవుతున్నననే కారణంతో ఉరివేసుకుని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జైపూర్ పోలీస్ట్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రసూల్ పల్లి గ్రామానికి చెందిన బొద్దుల శంకర్ దంపతులు ఈత కమ్మలతో చీపుర్లు, బూజు కర్రలు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. చిన్న కుతురైన బొద్దుల గంగోత్రి (18) కరీంనగర్ పట్టణంలోని ఓ హాస్టల్లో ఉంటూ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది. ఇటీవల మొదటి సంవత్సరం రెండోవ సెమిస్టర్ పరీక్షలు ముగించుకొని ఇంటికి వచ్చింది.

బుధవారం శంకర్ పని నిమిత్తం ఈత కమ్ముల కోసం బయటికి వెళ్లడం జరిగిందని, తిరిగి ఇంటికి వచ్చే సరికి గంగోత్రి ఉరి వేసుకొని విగతాజీవిగా ఉండటం గమనించిన శంకర్ బంధువులకు తెలియజేయడం జరిగిందని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని వెళ్లి పరిశీలించారు. ఆర్థిక పరిస్థితుల వల్లే తమ కూతురు గంగోత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులు పిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు గంగోత్రి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భూమేష్ తెలిపారు.

Leave a Reply