ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య
ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య
- సర్పంచ్ చిక్రం తులసీరాం
ఉట్నూర్ రూరల్, ఆంధ్రప్రభ:
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన విద్యా వనరులు అందుబాటులో ఉన్నాయని ఉట్నూర్ మండలంలోని సాలెవాడ (కె) గ్రామ సర్పంచ్ చిక్రం తులసీరాం అన్నారు.ఆయన బుధవారం సాలెవాడ (కె) ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ (కాపీలు) పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ చిక్రం తులసీరాం మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న విద్యా సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుబాటులో ఉందని, విద్యార్థులు క్రమశిక్షణతో చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సల్గర్ రవీందర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మనోజ్ రెడ్డి, ఉపాధ్యాయులు రవికుమార్, శేషరావు, సంగీత, గౌతం, విద్యా కమిటీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
