14thJuneeditorial | ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై యుద్ధ ప్రభావం

14thJuneeditorial | ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై యుద్ధ ప్రభావం

14thJuneeditorial | అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న తీవ్ర దాడులు
పెరుగుతున్న ప్రాణనష్టం
హోర్ముజ్ జలసంధిలో పెరుగుతున్న ఆతంకం
భారత్ సహా ఇతర దేశాలపై పడుతున్న ప్రభావం

14thJuneeditorial | మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇరాన్ల మధ్య యుద్ధం ప్రారంభమై 15 వారాలు పూర్తి అయింది. ఐదు వేల పైగా దాడులు జరిగాయి. వేలాది మంది మరణించారు. ఇరువర్గాలు ఇప్పటికీ శాంతించేందుకు సిద్ధంగా లేవు. ఈ యుద్ధం వల్ల ఎవరికి లాభమో, ఎవరికి నష్టంమో ఎవరూ చెప్పలేకపోతున్నారు. అమెరికా ఇజ్రాయెల్ తరఫున పోరాడుతోంది. ఈ యుద్ధం వల్ల అమెరికా ఆయుధాగారం క్రమంగా ఖాళీ అవుతోంది. కోటానుకోట్ల డాలర్ల విలువ చేసే ఆయుధాలు ముఖ్యంగా డ్రోన్లు, క్షిపణులు సర్వనాశనమయ్యాయి. అమెరికన్ పౌరులు ఇంధన ధరలు పెరిగిపోవడం వల్ల దేశ పౌరులు 58 బిలియన్ డాలర్లు చెల్లించారు.

మధ్యప్రాచ్యంలోని దేశాల ఆస్తులకూ, ప్రజల ప్రాణాలకు తీవ్రమైన నష్టం కలుగుతోంది. అయినప్పటికీ అమెరికా యుద్ధ విరమణకు ముందుకు రావడం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం అప్పుడప్పుడు కాల్పుల విరమణ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆయన మాటల్లో నిలకడ లేదు. అదే నోటితో ఇలాగైతే తాము ఆలోచించుకోవాల్సిందేనని అంటుంటారు. హోర్ముజ్ జలసంధి మీదుగా వెళ్ళే నౌకలపై జరుగుతున్న దాడులు, పెరుగుతున్న ఆతంకం ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. ఈ దాడులవల్ల ఈ రెండు దేశాలకే కాకుండా, చమురు కోసం గల్ఫ్, తదితర ప్రాంతాలకు వెళ్ళే ఇతర ప్రాంతాల నౌకల్లో సిబ్బంది మరణిస్తున్నారు. ఇది ఎంత మాత్రం సహించరాని విషయం. ఇరాన్ వల్లే తాము కాల్పులు జరపాల్సి వస్తోందని అమెరికా, అమెరికా కారణంగానే తాము ఆత్మరక్షణ కాల్పులు జరుపుతున్నామని ఇరాన్ సాకులు చెప్పుకుంటున్నాయి.

ఎలాగైతేనేం ఆస్తి, ప్రాణనష్టానికి అమెరికా, ఇరాన్లు బాధ్యత వహించాలి. ఈ యుద్ధం నాలుగు లేదా ఐదు వారాల్లో ముగిస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అటు తమ దేశీయులనే కాకుండా, ఇటు ప్రపంచ దేశాల వారిని మభ్యపెట్టారు. ఆయన తరచూ ఒప్పందానికి దగ్గరలో ఉన్నామంటూ అన్ని దేశాలను భ్రమపెట్టారు. అమెరికన్లు ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరోవంక పెట్రోల్, డీజెల్ ధరలు పెరిగిపోవడంతో వర్ధమాన దేశాలలో పరిస్థితి దారుణంగా తయారైంది. యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికన్ నగరాల్లో దాదాపు రోజూ ప్రదర్శనలు జరుగుతున్నాయి. అయినా, ట్రంప్ పట్టించుకోవడం లేదు. ప్రపంచంలో అత్యంత సురక్షిత దేశాలు కూడా ఈ దాడుల నుంచి తప్పించుకోలేకపోతున్నాయి. ఎపిక్ ప్యూరీ అనే ఆపరేషన్ కింద అమెరికా, మిత్ర దేశాలు 5,034 దాడులు జరిపాయి.

మరోవంక ఇరాన్ కూడా 1,792 దాడులు జరిపింది. ఈ మొత్తం దాడుల వల్ల అటూ, ఇటూ కూడా ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. భారత నౌకలపై అమెరికా దాడులు జరిపింది. ఈ దాడుల్లో ముగ్గురు నావికులు మరణించారు. ఇవి ఇరాన్ జరిపిన దాడులేనని అమెరికా ఆరోపించగా, అమెరికా జరిపినవని ఇరాన్ ఆరోపిస్తోంది. మొత్తానికి ఈ యుద్ధంతో ఏ సంబంధం లేని భారత్ వంటి దేశాలకు చెందిన నావికులు, సైనికులు ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోవడం ఎంతవరకు సమంజసం. ఈ యుద్ధానికి మూల కారకుడైన ట్రంప్ నంగనాచిలా ఇరానీనీ, దానికి మద్దతు ఇస్తున్న దేశాలను ఖండిస్తున్నారు. ప్రపంచంలో ఏ మూల అశాంతి చెలరేగినా, అందులో అమెరికా హస్తం ఉందన్నది జగద్విదితం. ఇది చరిత్ర చెప్తున్న సత్యం.