ఈరన్న స్వామి దేవస్థానంలో రూ.1.27 కోట్ల హుండీ ఆదాయం
ఈరన్న స్వామి దేవస్థానంలో రూ.1.27 కోట్ల హుండీ ఆదాయం
కౌతాళం, ఆంధ్రప్రభ : ఉరుకుంద శ్రీ లక్ష్మీ నరసింహ, ఈరన్న స్వామి దేవస్థానంలో బుధవారం నిర్వహించిన హుండీ లెక్కింపులో గత 74 రోజుల ఆదాయం రూ.1,27,68,230గా నమోదైంది.
భక్తులు కానుకల రూపంలో 46.280 గ్రాముల బంగారం, 14.420 కిలోల వెండిని సమర్పించినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.
దేవస్థానం డిప్యూటీ కమిషనర్, ఈఓ కె. వాణి, చైర్మన్ టి.జి. పాండురంగ శెట్టి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు, దేవస్థానం సిబ్బంది, బ్యాంకు ప్రతినిధులు, భ్రమరాంబ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
