జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్

ఖమ్మం, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్యాలయంలో మంగళవారం వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

వేడుకల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుని వారికి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా రాయల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ప్రజల ఐక్య పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. పన్నెండు సంవత్సరాలు పూర్తిచేసుకుని రాష్ట్రం పదమూడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రజల ఆకాంక్షల ఫలితమని పేర్కొన్న ఆయన, ప్రస్తుతం రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తోందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ కోర్రా లక్ష్మి, జనరల్ మేనేజర్లు జయప్రకాశ్ రెడ్డి, సురేష్, వేణు, ఎస్‌ఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply