ఉపాధ్యాయులకు టెట్ మెటీరియల్ ఆవిష్కరణ..

నంద్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ప్రతి ఉపాధ్యాయుడు టెట్ పరీక్షకు హాజరు కావాల్సిందే. ఇందుకు సంబంధించి ఉపాధ్యాయులకు ఎస్టీయు జిల్లా కార్యాలయం లో శనివారం రాష్ట్రోపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ఆకాడమిక్ కమిటీ ఇన్ సర్వీసు ఉపాధ్యాయుల టెట్ కు సంబంధించి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే రూపొందించబడిన మెటీరియల్ ను జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ఎస్.చంద్రశేఖర్,యం.అజాం బేగ్ లు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 23 సబ్ సెక్షన్ 1 పార్లమెంటులో సవరణ చేయుటకు కేంద్ర ప్రభుత్వం పై రాష్ట్ర ప్రభుత్వం వత్తిడి చేయాలి అన్నారు.

విద్యా హక్కు చట్టం అమలులోకి వచ్చిన తేదీ నుండి కాకుండా అంతకు ముందు నియమించబడిన ఇన్సెర్వీసు ఉపాధ్యాయులకు టెట్ నిర్వహించడం ఏమాత్రం సహేతుకం కాదన్నారు. ఇప్పటికే బోధనేతర కార్యక్రమాలతో ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అవుతుంటే మరొక వైపు బోధన చేయాల్సిన ఉపాధ్యాయులు టెట్ కొరకు చదువు కోవాల్సి వస్తే ప్రభుత్వ పాఠశాలలు మరింత నిర్వీర్యం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉపాధ్యాయుల వయోపరిమితి దృష్ట్యా విద్యాహక్కు చట్టాన్ని సవరించి టెట్ నుండి మినహాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ పాఠశాలల్లో యాప్ ఒత్తిడి భారంతోను పదవ తరగతి పబ్లిక్ పరీక్షలతో ఉపాధ్యాయులు సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టెట్ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో రాష్ట్ర సాంకేతిక కమిటీ కన్వీనర్ గిరిబోయిన నాగేంద్ర కుమార్ శ్రీనివాస రావు,నాగరాజు, సుబ్బయ్య, ఎల్లసుబ్బయ్య, చంద్రశేఖర్, మల్లేశ్వరుడు, శ్రీనివాసులు, ప్రసాద్, నాగేంద్ర కుమార్, నరసింహారావు ,సుబ్బయ్య ,గోపాలకృష్ణుడు, సోమయ్య, మల్లికార్జున ,తిరుపతయ్య ,తదితరులు పాల్గొన్నారు.