ఆర్థిక‌ భ‌రోసా

ఆర్థిక‌ భ‌రోసా

బీమా చెక్కు అందజేత


మోపిదేవి – ఆంధ్రప్రభ : దివంగ‌త‌ ఘంటా వెంకట లక్ష్మీ కుటుంబానికి టీడీపీ పార్టీ అండగా నిలబడింది. అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ఘంటా వెంకట లక్ష్మీ (Ghanta Venkata Lakshmi) ప్రమాదవశాత్తు మృతి చెందడంతో పార్టీ భీమా పథకం ద్వారా మంజూరైన ఐదు లక్షల రూపాయల చెక్కును శనివారం ఆమె నివాసంలో కుమారుడు నవీన్ కు అందజేశారు.

దివి మార్కెట్ కమిటీ చైర్మన్, టీడీపీ నాయకులు కొల్లూరి వెంకటేశ్వరరావు (Kolluri Venkateswara Rao) ఈ చెక్కును అందజేసి, వారి కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ పారీ్ట అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మోపిదేవి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నడకుదిటి జనార్దన రావు, పీఏసీఎస్ చైర్మన్ లు నాదెళ్ల శరత్ చంద్రబాబు, బళ్ల ప్రసాద్, గ్రామ పార్టీ అధ్యక్షుడు నాదెళ్ల రాజేష్, పార్టీ నేతలు మండలి రామ్మోహన్ రావు, జన్ను వెంకటేశ్వరరావు, మీసాల శివ రామ కృష్ణ, కోట సాయి,కనపర్తి శ్రీను,కనపర్తి సుధాకర్, కొల్లూరి వాసు పాల్గొన్నారు.

Leave a Reply