జగదీశ్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన బీఆర్ఎస్ శ్రేణులు

మునుగోడు, ఆంధ్రప్రభ: మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం మునుగోడు మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్‌లో బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కేక్ కట్ చేసి బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మునుగోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు బొడ్డు నరసింహ గౌడ్, నాయకులు మారగోని అంజయ్య గౌడ్, మేకల శ్రీనివాస్ రెడ్డి, పోలగోని సైదులు గౌడ్, గూడపూర్ సర్పంచ్ నన్నూరి భూపతిరెడ్డి, జంగిలి సాంబయ్య, పాల్వాయి వెంకట్ రెడ్డి, గజ్జల బాలరాజు, జిట్టగోని మల్లేష్, బోయపర్తి సురేందర్, ఐతగోని విజయ్, బండారు శ్రీనివాస్, గడగోటి రాంబాబు, బోయపర్తి సైదులు, గురజాల శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.