ఉరుసు చెరువు ప్రాంగణంలో హరితహారం

ఉరుసు చెరువు ప్రాంగణంలో హరితహారం

ప్రజా పాలన. ప్రగతి ప్రణాళిక లో భాగంగా మొక్కలు నాటిన సిబ్బంది

కరీమాబాద్, ఆంధ్రప్రభ : గ్రేటర్ వరంగల్ 40 డివిజన్ ఉర్స్ చెరువు ప్రాంగణంలో ప్రజా పాలన , ప్రగతి ప్రణాళికలో బాగముగా టీఎస్ జి పిఎఫ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. మంగళవారం తెలంగాణ ప్రత్యేక రక్షణ దళం ప్రధాన సంచాలకులు స్వాతి లక్రా ఐపీఎస్ సూచనల ప్రకారం, టీజీఎస్పీఎఫ్అడిషనల్ కమాండెంట్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో వరంగల్ యూనిట్ సిబ్బంది అందరూ కలసి ఎస్పీఎఫ్ వరంగల్ ఇన్స్పెక్టర్ బీమా నాయక్ ప్రోత్సాహంతో ఎస్సై డి తిరుపతి రెడ్డి హెడ్ కానిస్టేబుల్స్ కానిస్టేబుల్స్ సిబ్బంది తో40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్లి రవి సహకారంతో మొక్కలు నాటడం జరిగిందని కమాండెంట్ కోటేశ్వరరావు తెలిపారు.

మొక్కలు నాటే కార్యక్రమంలో ఆర్ ఐమున్సిపాలిటీ సిబ్బంది సహకారంతోఉరుసు గుట్ట చెరువు ప్రాంగణంలో హరితహారం కార్యక్రమంలో మొక్కలను విజయవంతంగా నాటినమని కార్పొరేటర్ మరుపల్లి రవి తెలిపారు. టీజీఎస్పి పోలీస్ వరంగల్ యూనిట్ ఇన్స్పెక్టర్ భీమా నాయక్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం చేయుటకు ప్రోత్సహించిన డీజీ మేడం స్వాతి లక్రాకి, సహాయ సహకారాలు అందించిన టీజీఎస్పీఎఫ్ వరంగల్ యూనిట్ సిబ్బందికి 40 డివిజన్ కార్పొరేటర్ ఎం రవికి మున్సిపల్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిజేయడం జరిగింది… మొక్కలు నాటే కార్యక్రమంలో టీజీఎస్పీఎఫ్ పోలీస్ సిబ్బంది 40 మంది వరకు పాల్గొన్నారు అని ఎస్సై భీమా నాయక్ తెలిపారు.