మద్యం సేవించి వాహనాలు నడపరాదు: ఎస్సై నరసింహరావు

మద్యం సేవించి వాహనాలు నడపరాదు: ఎస్సై నరసింహరావు

ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ: హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో గురువారం సాయంత్రం పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ఎల్కతుర్తి ఎస్సై నరసింహరావు ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనం నడుపుతున్న ఒక వ్యక్తిని పోలీసులు గుర్తించి కేసు నమోదు చేశారు.

ఈ సందర్భంగా ఎస్సై నరసింహరావు మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ప్రజలు తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టకుండా ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై పోలీసులు నిరంతరం ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తారని ఎస్సై హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుళ్లు విటల్, భాస్కర్ రెడ్డి, రాజు, ఆఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply