Sanitation Worker | ప్రజల సంక్షేమం కోసం విధి నిర్వహణకు ప్రశంసలు
Sanitation Worker | మంథని టౌన్, ఆంధ్రప్రభ: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మంథని మున్సిపాలిటీలో పారిశుధ్య సిబ్బంది తమ విధులను నిర్వర్తిస్తూ ఆదర్శంగా నిలిచారు.
భారీ వర్షంలోనూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుధ్య నిర్వహణ పనులను కొనసాగించడం పలువురి దృష్టిని ఆకర్షించింది. వర్షం కారణంగా పనులకు అంతరాయం కలిగినా తమ బాధ్యతలను విస్మరించకుండా సేవలు అందించడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు.
విధుల పట్ల అంకితభావంతో పనిచేసే ఇలాంటి సిబ్బంది ఉంటే దేశం మరింత పరిశుభ్రంగా ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.
కుండపోత వర్షంలోనూ విధి నిర్వహణలో నిమగ్నమైన ఆ మహిళా పారిశుధ్య సిబ్బందికి స్థానికులు అభినందనలు తెలియజేస్తూ, ఆమె సేవా తత్వానికి శతకోటి వందనాలు తెలిపారు.
