నెరవేరిన సీతానాగారం ప్రజల చిరకాలిక కోరిక
నెరవేరిన సీతానాగారం ప్రజల చిరకాలిక కోరిక
ఆర్టీసీ బస్సును ప్రారంభించిన సర్పంచ్
హసన్ పర్తి, ఆంధ్రప్రభ : వర్ధన్నపేట శాసన సభ్యులు కె ఆర్ నాగరాజు ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం సీతానాగరం ప్రజల చిరకాలిక కోరిక మేరకు పట్టణం నుండి గ్రామానికి బస్సు నడపడానికి ఆర్టీసీ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఈమేరకు సోమవారం ఆర్టీసీ బస్సును సర్పంచ్ కూకట్ల సునిత రమేష్ యాదవ్ ప్రారంభించారు.
ఈసందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఆర్టీసీ వారు జిల్లా కేంద్రం నుండి బస్సు నడిపిస్తారని పేర్కొన్నారు.బస్సు గ్రామానికి రావడం మూలంగా అన్ని వర్గాల ప్రజల రాకపోకలకు సులభమైందని అన్నారు. పలు గ్రామాలను కలుపుతూ ఆర్టీసీ బస్సు నడిపించడానికి కృషి చేసిన ఎమ్మెల్యే తో పాటు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భరత్ రెడ్డి, వార్డు సభ్యులు కొప్పుల రాజకోమురు, రాముల సతీష్, యూత్ అధ్యక్షులు సోనబోయిన ప్రవీణ్, కూకట్ల రాజేందర్ యాదవ్,మాజీ సర్పంచ్ దావ రవి, మహేందర్ రెడ్డి, సురేష్,డాన్ సాంబయ్య, డ్రైవర్, కండక్టర్,కారోబార్, గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
