HYD | నోటీసులపై స్పందించిన దానం నాగేందర్

HYD | నోటీసులపై స్పందించిన దానం నాగేందర్

HYD | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: హైకోర్టు ఇచ్చిన నోటీసులపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. హైదరాబాద్ ఆదర్శ్‌నగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయంపై వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల తన అనర్హత కేసులో స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వగా, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ ద్వారా బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ఒకటేనని తేలిందని దానం ఎద్దేవా చేశారు. తాను ఈ విషయం గురించి పత్రికల్లోనే చూశానని, ఇంకా అధికారికంగా నోటీసులు అందలేదని తెలిపారు. నోటీసులు వచ్చిన తర్వాత న్యాయవాదులతో చర్చించి సమాధానం ఇస్తానన్నారు.

ఈ కేసులో బీజేపీకి ఎలాంటి సంబంధం ఉందో తనకు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌లో స్పీకర్ ఇచ్చిన నిర్ణయాన్ని వ్యతిరేకించొద్దని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారని, ఆ విషయం రాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డికి తెలుసో లేదో తెలియదని దానం నాగేందర్ అన్నారు.