ఆలేరు ఎస్‌హెచ్‌ఓగా బాధ్యతలు స్వీకరించిన ఉదయ్ కిరణ్
- ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పోలీస్ స్టేషన్ నూతన స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ)గా జి. ఉదయ్ కిరణ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఎస్‌హెచ్‌ఓగా పనిచేసిన డి. యాలాద్రి బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో ఉదయ్ కిరణ్ నియమితులయ్యారు.
బాధ్యతలు చేపట్టిన అనంతరం పోలీసు అధికారులు, సిబ్బంది నూతన ఎస్‌హెచ్‌ఓకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ.. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.
నేరాల నియంత్రణతో పాటు ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా పనిచేస్తామని పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థకు ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రముఖులు, గ్రామస్తులు నూతన ఎస్‌హెచ్‌ఓను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసి సత్కరించారు.
