Bejjanki | ఆటో బోల్తా పడి..
Bejjanki | ఆటో బోల్తా పడి..
ఇద్దరికీ గాయాలు
Bejjanki | బెజ్జంకి, (ఆంధ్రప్రభ): ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న ఇందిరమ్మ చీరలు తీసుకొని వెళ్తున్న ఆటో (auto) అదుపు తప్పి బోల్తా పడడంతో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. మండల కేంద్రంలో చీరలు పంపిణి అనంతరం దేవక్కపల్లి గ్రామానికి ఆటోలో ప్రయాణిస్తుండగా దాచారం స్టేజి దగ్గర ఆటో అదుపుతప్పి బోల్తా (overturned) పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న దేవక్కపల్లికి చెందిన ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో కరీంనగర్ (Karimnagar) ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.
