మద్యం సేవించి వాహనం నడిపితే.. రెండు రోజుల జైలు శిక్ష

మద్యం సేవించి వాహనం నడిపితే.. రెండు రోజుల జైలు శిక్ష
చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వ్యక్తికి జయశంకర్ భూపాలపల్లి ప్రిన్సిపల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ జడ్జి దిలీప్ నాయక్ మంగళవారం రెండు రోజుల సాధారణ జైలు శిక్ష , జరిమానా విధిస్తూ తీర్పునిచ్చినట్లు చిట్యాల ఎస్ఐ పోచంపల్లి సతీష్ తెలిపారు.కనపర్తి కి చెందిన మునిగాల రమేష్ , చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు.
బ్రీత్ అనలైజర్ పరీక్షలో ఇతని ఆల్కహాల్ రీడింగ్ 550 ఎంజి100 ఎమ్మెలు గా నమోదైంది,నిందితుడిని మంగళవారం కోర్టులో హాజరుపరచగా, మోటార్ వాహనాల చట్టం ఎంవి ఆక్ట్ 185 ఏ , 130/177 కింద నేరం నిరూపితమైంది. దీంతో న్యాయమూర్తి నిందితుడికి 2 రోజుల సాధారణ జైలు శిక్ష పరకాల సబ్ జైలులో అనుభవించాలి.రూ. 2,100 నగదు జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రాణాపాయం ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై సతీష్ హెచ్చరించారు.
