దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలి..

దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలి..

దివ్యాంగులను విస్మరిస్తున్న ప్రభుత్వం
ఇది ప్రజా పాలన కాదు..ప్రజా వ్యతిరేక పాలన..
అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ
దివ్యాంగుల ఛలో అసెంబ్లీ ముట్టడికి బీజేపీ ఎమ్మెల్యేల మద్దతు..

నిజామాబాద్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : దివ్యాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి, దివ్యాంగుల సమస్యల ను వెంటనే పరిష్కరిం చాలని నెరవేర్చాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పా ల్ సూర్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు. అన్ ఎంప్లాయిడ్ డిసే బుల్డ్ అసోసియేషన్ ఆఫ్ యూత్ మంగళ వారం నిర్వహించిన ఛలో అసెంబ్లీ ముట్టడికి బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు.ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు..వికలాంగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.

ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏళ్లు గడిచి నా..మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా వికలాంగుల పెన్షన్ రూ.6 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీ ల అమలు ఎలాగో పూర్తి స్థాయిలో జరగడం లేదు, కనీసం వికలాంగుల సమస్య లను పరిష్కరించాలని తెలిపారు. ప్రధానంగా వారికి స్కూటీ అంద జేస్తామని చెప్పి విస్మ రించారన్నారు. స్వయం ఉపాధి కింద ఇస్తున్న రూ.50 వేల ఋణం ఏమాత్రం సరిపోవడం లేదని, దీన్ని 5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ముం దు పోలీసులు అడ్డుకో వడంతో స్వల్ప వాగ్వా దం చోటుచేసుకుంది. అనంతరం ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వా యి హరీష్, రామారావు పటేల్ తో కలిసి గన్ పార్క్ అమరవీరుల పార్క్ వద్ద నిరసన వ్యక్తం చేశారు.