పూరి గుడిసె దగ్ధం.. రూ.50 వేల ఆస్తి నష్టం

పూరి గుడిసె దగ్ధం.. రూ.50 వేల ఆస్తి నష్టం
నేరేడుచర్ల, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: నేరేడుచర్ల మండలం పుల్గంబండ తండ గ్రామ పంచాయతీ పరిధిలోని మూసి ఒడ్డు ప్రాంతంలో పూరి గుడిసె మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ.50 వేల ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.
మంగళవారం సాయంత్రం బాణోత్ కోటియా తన గుడిసెలో వంట చేస్తుండగా అకస్మాత్తుగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో గుడిసె పూర్తిగా కాలిపోయింది.
ఈ ఘటనలో గుడిసెలోని సామగ్రి అంతా దగ్ధమై ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రభుత్వం తగిన ఆర్థిక సహాయం అందించాలని బాధిత కుటుంబం కోరింది.
సమాచారం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ బానోత్ మంగమ్మ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.3 వేల నగదు, 30 కిలోల బియ్యం ఆర్థిక సహాయంగా అందజేశారు.
