Tributes | మాజీ ముఖ్యమంత్రి చిన్నారెడ్డి జయంతి

Tributes | వికారాబాద్, ఆంధ్రప్రభ : మాజీ ముఖ్యమంత్రి, గవర్నర్ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి 107వ జయంతి సందర్భంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని డిపో ముందు గల మర్రి చెన్నారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జయంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో SAP డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జె.మందారిక, మర్రి చెన్నారెడ్డి విగ్రహ ప్రతిష్టాపన కమిటీ కన్వీనర్ కె అనంత రెడ్డి, కళాశాల ఓ ఎస్ డి జి. రామచంద్రయ్య, కమాల్ రెడ్డి, చంద్రకళ, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పి.మల్లేశం, సూపరిండెంట్ అమర్నాథ్ రెడ్డి, యాదవ రెడ్డి, నరోత్తం రెడ్డి, మోహన్ రెడ్డి, వికాస మండలి సభ్యులు, SAP కళాశాల ఉపాధ్యాయులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో SAP కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జె.మందారిక మాట్లాడుతూ… మాజీ ముఖ్యమంత్రి వివిధ రాష్ట్రాల గవర్నర్ గా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి రాష్ట్రానికి, దేశానికి ఎన్నోరకాల సేవలు అందించారన్నారు. వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి మండలంలో సిరిపురం గ్రామంలో ఒక పేద, మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించి వైద్య విద్యను అభ్యసించి డాక్టర్ గా సేవలందిస్తూ సమాజంలోని సమస్యలపై విద్యార్థుల సమస్యల గురించి విద్యార్థి దశ నుండే పోరాటం చేశారన్నారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చి 33సంవత్సరాలకే మంత్రి పదవిని అధిరోహించి వికారాబాద్ ను అబివృద్ధి చేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి అన్నారు.

అంతేకాకుండా ఆయన తెలంగాణ ఉద్యమానికి పునాది వేసి ఉద్యమకాంక్షను రగిల్చిన మొదటి నాయకుడని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఉత్తరప్రదేశ్, పంజాబ్, తమిళనాడు వంటి రాష్ట్రాలకు గవర్నర్ గా సేవలందించారు. ముఖ్యంగా వికారాబాద్ లో విద్యా సంస్థలు లేకపోవడంతో ఈ ప్రాంతం వెనుకబడి ఉందని దీనికి కారణం విద్య లేకపోవడమని, ఆయన వికారాబాద్ లో SAP కళాశాలను ఏర్పాటు చేసి వేల మందికి విద్య, ఉపాధిని అందించిన ఘనత డా.మర్రి చెన్నారెడ్డిదని, అలాంటి వ్యక్తి సేవలను మనం నిరంతరం స్మరించుకుంటూ ఉండాలని, ఆయన 107వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పించి, ఆయన సేవలను స్మరించుకోవడం జరిగిందన్నారు.

Leave a Reply