Celebrations | సెయింట్ జోసఫ్ లో సంక్రాంతి సంబరాలు

Celebrations | మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని సెయింట్ జోసఫ్ (సిబిఎస్ఇ) ఉన్నత పాఠశాలలో ఇవాళ సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిగాయి. మూడు రోజుల పండగ విశేషాలను కళ్ళకు కడుతూ కార్యక్రమాలు నిర్వహించారు. బసవన్న, హరిదాసు కీర్తనలు, భోగి పల్ల పేరంటం, గొబ్బెమ్మలు, భోగి మంట చుట్టూ నృత్యాలు, పొంగలి తయారీ, ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు సందడిగా గడిపారు.
పాఠశాల ప్రిన్సిపల్ ఎలిజబెత్ రాణి మాట్లాడుతూ… విద్యార్థులకు మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. అనంతరం ముగ్గుల పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అంతోని, పాషా, ప్రశాంత్, మధు, శ్రీను, జగన్, నవీన్, ప్రసాద్, లింగయ్య, మహమూద్, లక్ష్మి, జయ, రాజమ్మ, బాలరాణి, ప్రేమలత, శ్రీలత, మౌనిక, అనిత పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
