అరూరి సాంబయ్యకు దళిత రత్న అవార్డు

కాజీపేట, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం నియమించిన బాబు జగ్జీవన్ రామ్, డా. బి.ఆర్. అంబేద్కర్ మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో కాజీపేటకు చెందిన అరూరి సాంబయ్యకు ‘దళిత రత్న’ అవార్డు ప్రదానం చేశారు.
ఈ అవార్డును ఉత్సవాల కమిటీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వైస్ చైర్‌పర్సన్ మేతరి రోజా రాణి, కో-చైర్మన్ దుమ్మటి సుదర్శన్ బాబు, మాజీ మంత్రి డా. ఏ. చంద్రశేఖర్, ఎంపీ గడ్డ వంశీ కృష్ణ, మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ మాదిగ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరగారి ప్రీతం, డా. పెరుమండ్ల రామకృష్ణలు సంయుక్తంగా అందజేశారు.
